ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్

Submitted by nanireddy on Mon, 07/23/2018 - 09:47
mla-pratap-kumar-reddy-house-arrest

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అల్లూరు మండలం ఇస్కపల్లిలో పర్యటనకు వెళుతున్న  ఆయనను.. గృహనిర్బంధం చేశారు పోలీసులు. ఆయన ఇంటి ముందు పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో ఉంది ఇస్కపల్లి. ఇవాళ ఆ గ్రామంలో పర్యటిస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే.. ఇస్కపల్లికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు పర్యటనని వ్యతిరేకిస్తున్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి రావద్దంటూ నినాదాలు చేశారు.   దీంతో.. ఆ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందంటూ పోలీసులు ఎమ్మెల్యేకు సూచించారు. ఆయన గ్రామంలో పర్యటించకుండా హౌస్ అరెస్ట్ చేశారు.

English Title
mla-pratap-kumar-reddy-house-arrest

MORE FROM AUTHOR

RELATED ARTICLES