ఎమ్మెల్యే తండ్రికి టోకరా.. 50 లక్షలతో ఉడాయించిన డ్రైవర్!

Submitted by arun on Thu, 08/16/2018 - 09:09

ఎమ్మెల్యే తండ్రికి టోకరా వేసి ఓ కారు డ్రైవర్ అతడి వద్ద ఉన్న రూ.50 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తుండగా చోటుచేసుకుంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్‌ రూ.50 లక్షలతో పారిపోయాడు. రామకృష్ణారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేసే మల్లికార్జున కారులో ఉన్న 50లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. దీంతో చోరీ ఘటనపై రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్‌ నుంచి రాజంపేటకు వెళుతున్న రామకృష్ణారెడ్డి కర్నూలులోని రాజ్‌విహార్‌ హోటళ్లో భోజనం కోసం ఆగారు. దీంతో కారులో ఉన్న  50 లక్షల నగదుకు డ్రైవర్‌ను కాపలాగా ఉంచి భోజనానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి భోజనం చేసి వచ్చేలోగా కారులో ఉన్న సొమ్ముతో డ్రైవర్ మల్లికార్జున పరారయ్యాడు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌కు వచ్చిన డీఎస్పీ, సీఐలు సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించారు.
 

English Title
mla father car driver flees with 50 lakh cash in kurnool

MORE FROM AUTHOR

RELATED ARTICLES