ఎట్టకేలకు కాంగ్రెస్ తొలి జాబితాకు ముహూర్తం ఖరారు ..!

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆశావాహుల పరిస్ధితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం సాగిస్తున్న నేతలు మరో వైపు తమకు టికెట్...

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆశావాహుల పరిస్ధితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం సాగిస్తున్న నేతలు మరో వైపు తమకు టికెట్ దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఖారారైందంటూ వినిపిస్తున్న వార్తలతో ఆశావాహులు అప్రమత్తమయ్యాయి. తొలి జాబితాలోనే తమ పేర్లు ఉండేలా చూడాలంటూ అటు దేవుళ్లను ఇటు అధిష్టాన నేతలను వేడుకుంటున్నారు.

అదిగో జాబితా ..ఇదిగో ప్రకటిస్తామంటూ నెల రోజుల నుంచి నాన్చుతూ వస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు తొలి జాబితాకు ముహూర్తం ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే నెల ఒకటిన అభ్యర్ధుల జాబితాతో పాటు మ్యానిఫేస్టో సైతం విడుదల చేస్తామని ప్రకటించడంతో అందరిలోనూ ఆస్తకి పెరిగింది.

ఇప్పటి వరకు మహాకూటమి పొత్తులు ఖరారు కాలేదు. సీట్లపై తుది ని‌ర్ణయానికి రాకముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాలను కూడా ఆలోచనకు గురి చేసింది. సీట్ల విషయంలో సర్ధుకు పోయేందుకు సిద్ధమంటూ ప్రకటించిన టీడీపీ తాము కోరిన స్థానాలే ఇవ్వాలంటూ పేచీ పెట్టింది. దీనికి తోడు ఓ వైపు సీపీఐ, మరో వైపు టీజేఎస్ తమ డిమాండ్లపై కాసింత గట్టిగానే పట్టుబడుతున్నాయి. ఇదే సమయంలో పార్టీలో కొత్తగా వచ్చిన నేతలు ముందస్తు హామీలను గుర్తు చేస్తున్నారు. ఇన్ని అభ్యంతరాల నేపధ్యంలో నవంబర్ ఒకటి ప్రకటన సాధ్యం కాకపోవచ్చనే చర్చ అన్ని పార్టీల్లో ఉంది.

పరిస్ధితులు ఎలా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం పార్టీలో ఉత్కంఠకు దారితీసింది. కూటమి పక్షాల ప్రతిపాదనలు కార్యవర్గ సమావేశంలో పార్టీల నేతలు అభిప్రాయాలపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా తెరపైకి తెచ్చిన సామాజిక న్యాయం, బిసిలకు 34 సీట్ల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. పలు చిక్కుముళ్లతో ఉన్న వీటిని పరిష్కరించి ఇప్పటికిప్పటికి జాబితా విడుదల చేయడం అంత ఈజీ కాదని పలువురు నేతలు భావిస్తున్నారు.

సీట్ల అంశం ప్రహసనంగా మారుతుండడంతో పార్టీనేతలు బహిరంగానే పిసిసి ని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలను నేతలను మభ్యపెట్టడానికే ఉత్తం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఓ వైపు ప్రచారం చేయమంటున్న నేతలు చివరి నిమిషంలో సీటు ఇవ్వకపోతే ఎలాగంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో అభ్యర్ధుల జాబితా కాంగ్రెస్‌కు కత్తి మీద సాములా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories