జగన్ ఫ్లెక్సీలో బాలకృష్ణ ఫోటో

జగన్ ఫ్లెక్సీలో బాలకృష్ణ ఫోటో
x
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం...

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొవ్వూరులో కొనసాగుతోంది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. మల్లవరానికి చెందిన ఓ కార్యకర్త జగన్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ జగన్‌ ఫోటో పక్కన ఓ పక్క కృష్ణ, మరోపక్క నందమూరి బాలకృష్ణ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. పాదయాత్రకు వచ్చిన వైకాపా కార్యకర్తలంతా ఆ ఫ్లెక్సీ చూసి షాకయ్యారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన వ్యక్తి వైకాపా కార్యకర్త అయినప్పటికీ బాలకృష్ణ అభిమాని అని.. అందువల్లే ఈ విధంగా ఈ ఫ్లెక్సీని పెట్టినట్లు స్థానికులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories