క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిచెల్‌ జాన్సన్‌

Submitted by nanireddy on Sun, 08/19/2018 - 15:44
mitchell-johnson-retires-all-forms-cricket

ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు మూడేళ్ల క్రితమే వీడ్కోలు పలికినా.. ఇప్పటి వరకు కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడాడు. అయితే ఇక నుంచి టీ20 లీగ్‌ల్లో సైతం ఆడనని పూర్తి స్థాయిలో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం స్పష్టం చేశాడు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్నీ మీడియాకు తెలియజేశాడు. 
 
'నా క్రికెట్‌ కెరీర్‌ అయిపోయింది. నేను నా చివరి బంతి వేశాను. చివరి వికెట్‌ను కూడా తీసుకున్నాను. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ రోజు ప్రకటిస్తున్నా. నేనింకా కొన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతానని భావించాను. కానీ నాశరీరం అందుకు సహకరించడం లేదు. పూర్తిగా అలసిపోయాను. ఈ ఏడాది ఐపీఎల్‌లో నాకు కలిగిన వెన్ను నొప్పి ఆటను ముగించాలని నన్ను హెచ్చిరించింది. దీంతో నా క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. మిగిలిన నా జీవితాన్ని ఆస్వాదిస్తాను' అంటూ పేర్కొన్నాడు. 

English Title
mitchell-johnson-retires-all-forms-cricket

MORE FROM AUTHOR

RELATED ARTICLES