మిస్ ఫైర్ అయిన జగన్ గన్..

Submitted by nanireddy on Wed, 08/01/2018 - 08:35
miss-fire-on-jagan-kapu-reservation-stategy

కాపులకు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ అధినేత జగన్ మనసు మార్చుకున్నారు. వారి రిజర్వేషణలకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. అది కేంద్రం పరిధిలో ఉన్న  అంశం కనుక అది సాధ్యపడితే తమ పార్టీ మద్దతు కచ్చితంగా ఉంటుందని చెప్పారు. అలాగే కాపు కార్పొరేషన్ కు ఐదేళ్లలో 10 వేల కోట్లు ఇచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పార్టీలో ఉన్న కాపు నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

తన ప్రజా సంకల్ప యాత్ర తర్పులోకి ఎంట్రీ ఇవ్వగానే రిజర్వేషన్లను తుట్టెను కదిల్చారు జగన్. 
కాపులకు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని ఉన్న అంశమని వెల్లడించారు. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న జోన్ కావటం..కొద్ది మంది యువకులు రిజర్వేషన్లకు సంబంధించి ప్ల కార్డులు ప్రదర్శించటంతో జగన్ ఇలా రియాక్ట్ అయ్యారు.  దీంతో కాపు నేత ముద్రగడ జగన్ నిర్ణయంపై మండిపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు  కూడా  జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టు జగన్ వదిలిన ఈ అస్త్రం మిస్ ఫైర్ అయింది. చివరికి సొంత పార్టీలోని కాపు వర్గ నేతలకు కూడా జగన్ స్టేట్ మెంట్ మింగుడు పడలేదు. పవన్ వ్యక్తిగత విషయాలపై విమర్శలు..ఆ వెంటనే కాపు రిజర్వేషన్లపై స్టేట్ మెంట్..జగన్ ను ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకమనే భావన తీసుకొచ్చాయి. ఇది ముందుగానే ఉహించిన జగన్ నష్ట నివారణ పనిలో పడ్డారు. పాదయాత్రంలో భాగంగా 225వ రోజున పీఠాపురానికి చేరుకున్న అయన..రిజర్వేషన్లపై తన ప్రకటనకు సంబంధించి వివరణ ఇచ్చుకుంటూనే.. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 10 వేల కోట్లు ఇస్తామని స్పష్టం చేశారు. తాము కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని.. ప్రతి రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని అలా మించినప్పుడు అది సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమవుతుంది. తద్వారా అది నీరుగారుతోంది. ఒకవేళ అసెంబ్లీలో రిసల్యూషన్ పాస్ చేసి 9 షెడ్యూల్ లో పెట్టమని కేంద్రానికి పంపినప్పుడు వారు దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని బిల్లు తోసిపుచ్చుతారని అన్నారు. 
 
ఇదిలావుంటే జగన్ తీసుకున్న  ఈ నిర్ణయం సరైనదే అయినా.. అలా వున్నపుడు ప్రకటన చేయకుండా ఉండాల్సిది అని పార్టీలోని కొందరు నేతలే అభిప్రాయపడుతున్నారట. 

English Title
miss-fire-on-jagan-kapu-reservation-stategy

MORE FROM AUTHOR

RELATED ARTICLES