మరో గంటలో ముగియనున్న ఆరో దశ ఎన్నికల పోలింగ్‌

మరో గంటలో ముగియనున్న  ఆరో దశ ఎన్నికల పోలింగ్‌
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఆరో విడత పోలింగ్ మరో గంటలో ముగియనుంది. ఆరు రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని .. 59 లోక్‌సభ...

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఆరో విడత పోలింగ్ మరో గంటలో ముగియనుంది. ఆరు రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని .. 59 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో చెదురుమదురు ఘటనలో పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 51 శాతం పోలింగ్‌ నమోదైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాకాలో భారీగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70 శాతం పోలింగ్‌ నమోదైంది. జార్ఖండ్‌లో 59 శాతం, మధ్యప్రదేశ్‌లో 53 శాతం, హర్యానాలో 52లో శాతం , బీహార్‌లో 45 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 43 శాతం పోలింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో మందకోడిగానే పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటలవరకు ఇక్కడ 45 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. గడచిన ఎన్నికల్లో ఇక్కడ ఏడు నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీజేపీ .. ఈ సారి కూడా సత్తా చాటాలని భావిస్తోంది. అయితే పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటంతో ... ఎవరికి లాభం .. ఎవరికి నష్టం అనే లెక్కలు రాజకీయ పార్టీలు వేసుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories