ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన యువకుడు...

Submitted by arun on Tue, 10/23/2018 - 10:56

హైదరాబాద్ లో మరో మైనర్ మ్యారేజీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదిభట్లకు చెందిన 17ఏళ్ల అమ్మాయి, స్థానికంగా ఉన్న వేణు అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు ఏడాది పాటు ప్రేమించుకున్నారు. తాను గర్భవతి అని తెలియడంతో పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో తప్పుడు ధృవపత్రాలతో ఇద్దరు ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి మనోవేదనతో అమ్మాయి తల్లి మృతిచెందింది. ఇప్పడు, మూడు కోట్లు ఇస్తేనే ఆ అమ్మాయి కోడలుగా అంగీకరిస్తామని వేణుకుటుంబసభ్యులు అంటున్నారని అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

ఆదిభట్లలో తమ ఇంటి సమీపంలో ఉండే వేణుని బాధితురాలు ఏడాది నుంచి ప్రేమిస్తోంది. మాయమాటలతో ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడు. ఇద్దరి ఇళ్లలో విషయం తెలిసే లోపే తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చింది. అమ్మయి వయసు 17సంవత్సరాలే కావడంతో తప్పుడు ఆధార్ కార్డును సృష్టించాడు. సెప్టెంబరు 14న చాంద్రాయణగుట్టలోని ఆర్యసమాజ్ లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి వరకు లవ్ కమ్ మైనర్ మ్యారేజీని ఇద్దరి ఇళ్లలో తెలియకుండా సీక్రెట్ గా నడిపించేశారు.  

వీరి మ్యారేజీ విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఇంతలో అమ్మాయి రెండు నెలల గర్బవతి అని తెలియడంతో తట్టుకోలేని తల్లి మనోవేదనతో పెళ్లి జరిగిన వారం రోజుల్లోనే చనిపోయింది. ఈ బాధలో నుంచి తేరుకున్న అమ్మాయి తండ్రి, తన కూతురితో కలిసి వేణు కుటుంబసభ్యులను ఆశ్రయించాడు. వారు, అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లడానికి నిరాకరించారని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భవతి కావడంతో మూడు కోట్లు ఇస్తే తమ కోడలిగా అంగీకరిస్తామన్నారని తెలిపారు.  

తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ మ్యారేజీపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వేణు కుటుంబసభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. తమ కొడుకుపై అమ్మాయి బంధువులు ఒత్తిడి తీసుకొచ్చి, బెదిరించి పెళ్లి చేశారని ఆరోపిస్తున్నారు. 

English Title
minor marriage in hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES