ముందస్తుపై ఎందుకు వెనక్కి తగ్గారు..?

Submitted by arun on Thu, 08/23/2018 - 08:49
kcr

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై అంచనాలు తారుమారైనట్లు తెలుస్తోంది. అధినేత ఒకటనుకుంటే మంత్రులు మరోలా స్పందించడంతో కేసీఆర్‌ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. మంత్రులతో సుమారు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ ఎన్నికలు ఎప్పుడు జరిపితే మంచిదంటూ అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు అంశం ఎలాగున్నా సెప్టెంబర్ రెండున సుమారు 25లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో ముందస్తు మబ్బులు వీడిపోతున్నాయి. సెప్టెంబర్‌లో అసెంబ్లీని రద్దుచేసి డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్తారంటూ జరుగుతోన్న ప్రచారానికి దాదాపు చెక్‌ పడింది. సుమారు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై చర్చించారు. ముందస్తుకు వెళ్దామా వద్దా అంటూ అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే మెజారిటీ మంత్రులు ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదనే వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే, ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలు వెళ్తాయని మంత్రులు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రుల అభిప్రాయంతో ఏకీభవించిన కేసీఆర్ ముందస్తుకు వెళ్తామని అసలు మనమెప్పుడు చెప్పామని అన్నట్లు తెలుస్తోంది.

కేవలం రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా జరిగిన ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతోపాటు పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ఏలాగూ ఎన్నికల టైమ్‌ దగ్గర పడుతుండటంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రగతి నివేదన సభపై సమాలోచలను జరిపారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ చర్చించారు. ఎన్నికలతోపాటు అనేక అంశాలపై తన అభిప్రాయాలపై స్పష్టతనిచ్చిన సీఎం కేసీఆర్‌ సర్వేల్లో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యక్తమైనట్లు అభిప్రాయాలను అందరి ముందు పెట్టినట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు సన్నాహకంగా సెప్టెంబర్‌ రెండున నిర్వహించాలనుకున్న ప్రగతి నివేదన సభను యథాతథంగా జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో సభ ఏర్పాట్లు, నిర్వహణపై చర్చించేందుకు ఈనె 24న కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరగనుంది.

English Title
Ministers oppose early Telangana elections, KCR holds urgent meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES