వైసీపీపై మండిపడ్డ మంత్రి నక్కా ఆనందబాబు

Submitted by arun on Wed, 07/18/2018 - 13:07
nakka

వైసీపీ ఎంపీల రాజీనామాల నాటకాలు పార్లమెంటు సమావేశాల్లో బట్టబయలు అవుతాయని, మోదీకి భయపడి పార్లమెంట్ మెట్లు ఎక్కడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. మోడీతో లాలుచి రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు ముందుగానే రాజీనామాలు చేశారని, సాధారణ ఎన్నికలకు వచ్చే దమ్ము, దైర్యం ఉందా అంటు ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లాలో ట్రైకార్ పథకం ఎస్సీ లబ్దిదారులకు ఇన్నోవా కార్లను మంత్రి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.32 కోట్లతో 150 ఇన్నోవా, 50 బోలెరో వాహనాలు అందజేశామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. దళిత, గిరిజన డ్రైవర్‌లను ఓనర్లు చేసిన ఘనత చంద్రబాబుదే మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.

Tags
English Title
minister nakka fire on ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES