మంత్రి కేటీఆర్ మరోసారి ఫన్నీ ట్వీట్!

మంత్రి కేటీఆర్ మరోసారి ఫన్నీ ట్వీట్!
x
Highlights

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటారు. ఎంతోమంది ట్విట్టర్ ద్వారానే కేటీఆర్‌కు తమ సమస్యలను చెప్పుకుంటుంటారు. తన దృష్టికి వచ్చే...

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటారు. ఎంతోమంది ట్విట్టర్ ద్వారానే కేటీఆర్‌కు తమ సమస్యలను చెప్పుకుంటుంటారు. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యపైనా కేటీఆర్ స్పందిస్తూ.. వెనువెంటనే సహాయం చేస్తుంటారు. మంత్రిగా ప్రభుత్వ పనులతో ఎప్పుడూ బిజీగా ఉన్నా కూడా.. అప్పుడప్పుడూ తనలోని హాస్యచతురతను బయటపెడుతుంటారు. జోక్‌లు వేస్తూ నవ్విస్తూ ఉంటారు. తాజాగా ఓ చిన్నారి హోంవర్క్‌ సంబంధించిన ఓ పత్రాన్ని షేర్‌ చేస్తూ కేటీఆర్‌ ఓ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ‘జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరన్నారు?. ఈ చిన్నారి ఎంత స్మార్ట్‌... చిన్నారితో పాటు ఆ టీచర్‌ కూడా అంతే స్మార్ట్.’ అంటూ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ నవ్వులు పూయిస్తోంది.

ఓ చిన్నారికి తన హోంవర్క్‌ సంబంధించి ఆకలితో ఉన్న పిల్లి ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ఓ ఫజిల్‌ అడిగారు. దానికి చిన్నారి ఫజిల్‌ లోపల ఎలా వెళ్లాలనేదాని గురించి ఆలోచించకుండా, పిల్లి నుంచి పాలకు షార్ట్‌కట్‌గా గీత గీసి ఫజిల్‌ పూర్తి చేసింది. విద్యార్థి జవాబుకి టీచర్ కూడా రైట్ మార్కు వేసి.. స్టార్‌ సింబల్‌ కూడా ఇచ్చారు. అందుకే ఈ చిన్నారి తెలివితేటలకు ఫిదా అయిన కేటీఆర్ ట్వీటర్‌ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇపుడా ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories