logo

మహాకూటమి టార్గెట్‌గా హరీష్‌రావు విమర్శలు

మహాకూటమి టార్గెట్‌గా హరీష్‌రావు విమర్శలు

మహాకూటమి టార్గెట్‌గా మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఏ ఒక్క మేలు చేయని కాంగ్రెస్‌, టీడీపీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారుంటూ ఆయన ప్రశ్నించారు. యాసంగిలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఒక్క సారైనా నీరందించారా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన టీఆర్ఎస్ హాయంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. సాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు ఏ అంశంతో ప్రచారం నిర్వహిస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షోభాలే తప్ప సంక్షేమం ఉండదంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

లైవ్ టీవి

Share it
Top