కర్నూలు టీడీపీలో వివాదం.. ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన డిన్నర్ పార్టీ ?

Submitted by arun on Sat, 12/30/2017 - 11:52
Minister Bhuma Akhila Priya

మంత్రి అఖిలప్రియ, అధికారపార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య తాజా వివాదానికి, బలాబలాల ప్రదర్శనకు ఈ నెల 31న ఏర్పాటు చేసిన డిన్నర్‌ వేదికగా మారింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన ఏడాదిని స్వాగతిస్తూ ఆ రోజున ఏవీ సుబ్బారెడ్డి డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి రావాలంటూ నంద్యాల, ఆళ్లగడ్డ నేతలకు స్వయంగా ఆహ్వానం పలికారు. 

ఈ కార్యక్రమంపై మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తనకు తెలియకుండానే ఆళ్లగడ్డలో డిన్నర్ ఇవ్వడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డిన్నర్ పార్టీకి ఎవరూ వెళ్లవెద్దంటూ పార్టీ నేతలకు సూచించారు. అయినప్పటికీ ఏవీ సుబ్బారెడ్డి తగ్గలేదు. తన బలం నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా తన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత పోరు ఇప్పుడు కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

English Title
minister bhuma akhila priya vs av subba reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES