జగన్ ఓ పెదరాయుడు.. అనుకున్నది సాధిస్తాడు: మోహన్ బాబు

జగన్ ఓ పెదరాయుడు.. అనుకున్నది సాధిస్తాడు: మోహన్ బాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత, నటుడు మోహన్ బాబు అభినందనలు తెలిపారు. జగన్ ఓ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత, నటుడు మోహన్ బాబు అభినందనలు తెలిపారు. జగన్ ఓ పెదరాయుడు అనీ, జగన్ ఏది అయితే అనుకున్నాడో అది సాధిస్తాడని స్పష్టం చేశారు. జగన్ కళ్లలో తడి కనిపించిందనీ, ప్రజలను ఎలా ఆదుకోవాలన్న తపన ఆయన కళ్లలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాభిషేకానికి ముందు శ్రీరాముడు పడ్డ కష్టాలే వైఎస్‌ జగన్‌ పడ్డారు. వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఏపీకి మంచి పాలన అందిస్తారని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం జ్యోతి బసు తరహాలో 30 ఏళ్లకు పైబడి జగన్‌ పాలన అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories