వేడెక్కిన ఖమ్మం జిల్లా రాజకీయాలు

వేడెక్కిన ఖమ్మం జిల్లా రాజకీయాలు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. హస్తం గుర్తుపై గెలిచి అధికార పార్టీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. హస్తం గుర్తుపై గెలిచి అధికార పార్టీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కార్యకర్తల్లో పెరుగుతున్న అసహనం ఆగ్రహంగా మారుతోంది. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఊహించని విధంగా ఛేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వేడెక్కిన రాజకీయ వాతావరణ పరిస్థితులపై స్పెషల్ రిపోర్ట్.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిరసన గళం పెరుగుతోంది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు జిల్లా పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విరుచుపడుతున్నారు. ఇల్లెందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తరపున ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ నేతలలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలకు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కాంగ్రెస్‌ పార్టీ బీ ఫాంపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని, ప్రజలను మోసగించారని వారిపై పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు.ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారిద్దరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనా ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు సన్నద్ధమవుతున్నారు. కాంగ్ర్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారటంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రజా పరిరక్షణ పేరుతో యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ కేడర్ తిరుగుబాటు ఆందోళన నేపధ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల ప్రచారం తమకు ఏ మేరకు కలిసి వస్తుందో అర్ధకం కాక అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల్లో లాభం జరిగే మాటేమో గానీ కాంగ్రెస్ ఎదురు దాడితో నష్టమే జరుగుతున్న భావన వ్యక్తమవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories