కేరళ వరద బాధితులకు వైసీపీ ఎమ్మెల్యే కోటి విరాళం

Submitted by nanireddy on Sat, 08/25/2018 - 16:33
mekapati-goutham-reddy-donation-kerala-flood-victims

పది రోజులపాటు కురిసిన వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. దీంతో ఆ రాష్ట్రానికి సాయం చేసేందుకు వివిధ సంస్థలతోపాటు రాజకీయ నేతలు, పార్టీలు ముందుకొచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కేరళ వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా రూ.కోటి విరాళాన్ని కేఎంసీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్,  గౌతమ్‌ రెడ్డి చెప్పారు. ఈ విరాళాన్ని ఈ నెల 28,29 తేదీల్లో స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి డీడీని అంజేయనున్నట్టు అయన తెలిపారు. 

English Title
mekapati-goutham-reddy-donation-kerala-flood-victims

MORE FROM AUTHOR

RELATED ARTICLES