రన్నింగ్‌ బస్సు నుంచి ఊడి పడిన డీజిల్‌ ట్యాంక్‌

x
Highlights

2, 3 రోజులుగా కురుస్తున్న వర్షం హైదరాబాద్ వాసులకు చికాకు తెప్పిస్తోంది. కానీ అదే వర్షం 27 మంది ప్రాణాలు కాపాడింది. హైదరాబాద్‌‌లో మేఘన ట్రావెల్స్ బస్సు...

2, 3 రోజులుగా కురుస్తున్న వర్షం హైదరాబాద్ వాసులకు చికాకు తెప్పిస్తోంది. కానీ అదే వర్షం 27 మంది ప్రాణాలు కాపాడింది. హైదరాబాద్‌‌లో మేఘన ట్రావెల్స్ బస్సు డీజిల్ ట్యాంకర్ ఊడింది. వర్షం పడి రోడ్డు తడిగా ఉండటంతో నిప్పులు చెలరేగలదు. దీంతో ప్రయాణికులంతా సేఫ్‌గా బయటపడ్డారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి మేఘన ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నగరం నుంచి నంద్యాలకు బయల్దేరిన బస్సు లక్డీకపూల్ ఫ్లై ఓవర్ పైకి చేరేసరికి డీజిల్ ట్యాంకర్ ఊడిపోయింది. దీనిని గమనించని డ్రైవర్ ఊడిన డీజిల్ ట్యాంకర్‌తోనే బస్సును ముందుకు నడిపాడు. డీజిల్ వాసన వస్తుండటంతో ప్రయాణికులు అప్రమత్తమై కేకలు వేశారు. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపేయడంతో 27 మంది ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు. హైదరాబాద్‌లో 2, 3 రోజులుగా వర్షం కురుస్తోంది కాబట్టి పెను ప్రమాదం తప్పింది. వర్షంతో రోడ్డు మొత్తం తడిగా ఉండటంతో డీజిల్ ట్యాంకర్ రోడ్డుకు తగిలి మంటలు చెలరేగలేదు. వర్షం పడకపోయి ఉంటే సీన్ మరోలా ఉండేది.

ఈ ఘటనలో మేఘన ట్రావెల్స్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. డీజిల్ ట్యాంకర్ ఊడి రోడ్డుపై పడేవరకు వీళ్లేం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రయాణికుల ప్రాణాలు రిస్క్‌లో పెట్టి ట్రావెల్స్ బస్సు నడపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫిట్‌నెస్ చెక్ చేయకుండా అవసరమైన మరమ్మత్తులు చేపట్టకుండా ఇలా డీజిల్ ట్యాంకర్ ఊడే వరకు ఎలా ఊరుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల అదృష్టం బాగుండి వర్షం కురిసింది. లేకపోతే డీజిల్ ట్యాంకర్ తారు రోడ్డుకు రాసుకుంటే వెంటనే నిప్పులు చెలరేగేవి. అప్పుడు మంటలు వ్యాపించి బస్సును చుట్టుముట్టేవి. అప్పుడు ఎంతమంది ప్రాణాలు రక్షించుకునేవారు.? అందుకే మేఘన ట్రావెల్స్ యాజమాన్యంపై అంతా మండిపడుతున్నారు. ప్యాసెంజర్ల ప్రాణాలు పణంగా పెట్టి రోడ్లపై బస్సులు తిప్పే ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories