కాంగ్రెస్ కు భారీ షాక్.. ఇరకాటంలో పడ్డ రాహుల్

కాంగ్రెస్ కు భారీ షాక్.. ఇరకాటంలో పడ్డ రాహుల్
x
Highlights

2019 ఎన్నికల్లో మహా కూటమితో ప్రధాని మోడీని ఢీకొట్టాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న బీఎస్పీ...

2019 ఎన్నికల్లో మహా కూటమితో ప్రధాని మోడీని ఢీకొట్టాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న బీఎస్పీ హ్యాండిచ్చింది. త్వరలో ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత అజిత్‌జోగితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయించారు. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగి సారథ్యంలోని ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ 55 స్థానాల్లో, బీఎస్పీ 35 స్థానాల్లో పోటీ చేసేలా పొత్తు కుదిరింది. దీంతో బీజేపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలన్న కాంగ్రెస్‌ ఆశలపై మాయావతి నీళ్లు చల్లినట్లైంది. 2013లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 90 స్థానాల్లోనూ పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న దళితుల ఓట్లకు గాలం వేసేందుకు, జోగి పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ కూడా మాయావతితో పొత్తుకు ఓకే చెప్పింది. అయితే చివరకు మాయావతి కాంగ్రెస్ కు హ్యాండివ్వడం, ఆమె.. కాంగ్రెస్ ను వ్యతిరేకించిన అజిత్‌ జోగికి మద్దతు పలకడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories