ముంబైలో మహా విషాదం..15 మంది మృతి..15 మందికి గాయాలు

ముంబైలో మహా విషాదం..15 మంది మృతి..15 మందికి గాయాలు
x
Highlights

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లోయర్ పరేల్ లోని కమల మిల్స్ భవన సముదాయంలో జరిగిన ప్రమాదంలో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి....

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లోయర్ పరేల్ లోని కమల మిల్స్ భవన సముదాయంలో జరిగిన ప్రమాదంలో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. 16 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. గాయపడినవారిని హుటాహుటిన కెమ్ హాస్పిటల్, సియోన్ ఆస్పత్రికి తరలించారు. ఓ పబ్బులో జరిగిన కరెంట్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని సమాచారం.

ముంబై లోయర్‌ పరేల్‌లోని కమలామిల్స్‌ సముదాయంలోని మోజో బిస్ట్రో పబ్బులో తొలుత మంటలు అంటుకున్నాయి. మూడో అంతస్థులోని పబ్బులో చెలరేగిన మంటలు అరగంటలోనే భవంతి మొత్తానికి వ్యాపించాయి. భవనం మొత్తం వేగంగా కాలిపోయింది. ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడడంతో భవంతిలో ఉన్నవారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో 15 మంది మంటల్లో కాలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 8 గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.

ముంబైలోని కమల మిల్స్ కాంపౌండ్‌‌ అత్యంత కమర్షియల్ ప్రాంతం. ఇక్కడ పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు, పబ్బులు ఉన్నాయి. అలాగే పలు న్యూస్ ఛానెళ్ల కార్యాలయాలు కూడా కమల మిల్స్ కాంపౌండ్‌లో ఉన్నాయి. ఇలాంటి నివాస ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పబ్బులు నడపడంపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. రెస్టారెంట్లు, పబ్బుల్ని తరలించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రమాదం జరిగిన పబ్బుకి లైసెన్స్ ఎలా ఇచ్చారో అర్థంకావడంలేదని అగ్నిమాపక అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories