టీడీపీ పోల్ పోస్ట్‌మార్టం

టీడీపీ పోల్ పోస్ట్‌మార్టం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి ఫలితాలు రావడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది అయితే ఈలోపు గెలుపోటములపై ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు....

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి ఫలితాలు రావడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది అయితే ఈలోపు గెలుపోటములపై ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు. ఇప్పటికే సొంత సర్వేలతో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న సీఎం చంద్రబాబు నియోజకవర్గాల వారీగా బరిలో నిలచిన అభ్యర్థులతోనూ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి అప్పుడే పదిరోజులైంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్ని రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు రెస్ట్ తీసుకుంటారని అందరూ భావించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఒకవైపు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూనే మరోవైపు పార్టీ వ్యవహారాలపైనా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహింస్తున్నారు చంద్రబాబు.

ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 స్థానాల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో పాటు ఇతర సీనియర్ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, పోలింగ్ జరిగిన తీరు అడిగి తెలుసుకోనున్నారు. బూత్‌ల వారీగా పోలింగ్ జరిగిన తీరు సొంత పార్టీ నేతల సహకరించారా లేదా అనే విషయాన్ని కూడా అభ్యర్థులని అడిగి తెలుసుకోనున్నారు. టీడీపీ విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనే అంశమే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది ఇప్పటికే సొంత సర్వేలే 110కి పైగా సీట్లలో గెలుస్తామని బాబు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈవీఎంల మొరాయించడం, పోలింగ్ ఆలస్యం కావడం పైనా అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకోనున్నారు చంద్రబాబు. వీవీ ప్యాట్ స్లిప్పులు కౌంటింగ్, ఫలితాల సమయంలో వ్యవహరించాల్సిన వైఖరిపై అభ్యర్థులకు దిశా నిర్ధేశం చేయనున్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories