ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మారుతీరావు మాస్టర్ ప్లాన్...దృశ్యం సినిమా తరహా ...

Submitted by arun on Wed, 09/19/2018 - 10:03
Pranay Murder Case

ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి అమృత తండ్రి మారుతీరావు మాస్టర్ ప్లానే వేశాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. మారుతీరావు తమ్ముడు, కారు డ్రైవర్‌కు త్వరగా బెయిల్ వచ్చేఅవవాశముందని పోలీసులు చెప్పడంపై అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది. బాబాయ్ బయటికి వస్తే తనకు ప్రాణహాని ఉందని అంటోంది. 

కలకలం రేపిన ప్రణయ్ పరువు హత్యకేసు తనపైకి రాకుండా ప్రధాన నిందితుడు మారుతీరావు పన్నాగం పన్నాడు. ప్రణయ్ హత్య కేసులో తన ప్రమేయం లేదని నిరూపించుకోవడానికి మారుతీ రావు దృశ్యం సినిమా తరహా ప్లాన్ చేశాడు. హత్య జరగడానికి రెండు గంటల ముందే మారుతీరావు నల్గొండ చేరుకున్నాడు. దారిలో ఎదురు వచ్చిన పోలీసులతో అవసరం లేకపోయినా మాట్లాడాడు. అంటే హత్య సీన్‌లో తాను లేనని చెప్పడానికి తంటాలు పడి విఫలమయ్యాడు.

ఒకవేళ దృశ్యం సినిమా ప్లాన్ ఫెయిలైతే ప్రణయ్ హత్య కేసు నుంచి కొందర్ని తప్పించే ప్లాన్ కూడా మారుతీరావు చేశాడు. అబ్దుల్ కరీం, మహ్మద్ బారీ, అస్గర్ అలీని కేసు నుంచి బయటపడేయాలని అనుకున్నాడు. ప్రణయ్‌ను చంపిన సుభాష్ శర్మతో పాటు లొంగిపోదామని మారుతీ రావు అనుకున్నాడు. అయితే హత్య తర్వాత నిందితుల మధ్య కమ్యూనికేషన్ ఆగిపోవడంతో మారుతీ రావు లొంగుబాటు ప్లాన్ ఫలించలేదు. 

అయితే ప్రణయ్ హత్య కేసులో A6గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్, A7 అయిన మారుతీరావు కారు డ్రైవర్ కు హత్య గురించి తెలిసినా వారికి కుట్రలో భాగస్వాములు కాబట్టి వారికి త్వరగా బెయిల్ వచ్చే అవకాశముందని ఎస్పీ రంగనాథ్ చెప్పడంపై అమృత అభ్యతరం చెబుతోంది. వారిద్దరూ బయటికి వస్తే తననూ చంపేస్తారని అంటోంది. పోలీసులు చెబుతున్నట్లు ప్రణయ్ హత్య కేసు ఏడుగురు నిందితుల్లో ఐదుగురే కీలక పాత్రధారులా..ఇద్దరికి బెయిల్ వచ్చేస్తుందా..కోర్టులు ఏమి తేలుస్తాయనేది వేచి చూడాలి.
 

English Title
maruthi rao master plan for to escape from parany murder case

MORE FROM AUTHOR

RELATED ARTICLES