16 ఏళ్ల కుర్రాడితో వెళ్లిపోయిన 30 ఏళ్ల వివాహిత

Submitted by arun on Wed, 08/01/2018 - 17:32
married woman

ప్రేమకు - వ్యామోహానికి తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు నేటి తరం.. ఇప్పుడు క్షణికావేశాలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో వెలుగుచూసిన ఘటన రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు సభ్య సమాజానికి తలవంపులు తెచ్చింది. ఆమెకు 30... అతడికి పదహరేళ్లు వీరిదదరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.  దీంతో  ఆ పదహరేళ్ల కుర్రాడితో ఆ వివాహిత పారిపోయింది.  ఆ కుర్రాడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఒంగోలులో చోటు చేసుకొంది.

ఒంగోలు పట్టణంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఆ  యువకుడు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఓ వివాహిత భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. ఆ వివాహితకు ఇంటర్ విద్యార్ధికి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.  ఈ విషయం తెలియడంతో భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై భార్య,భర్తల మధ్య గొడవ జరిగింది.  ఈ గొడవ కారణంగా తాను పుట్టింటికి వెళ్లిపోతున్నట్టు ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది. అదే రోజు నుంచి పక్క ఇంట్లో ఉండే బాలుడు కూడా కనిపించడం లేదు. బాలుడి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అతని స్నేహితులను విచారించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు కనిపించడం లేదని.. ఆ ఆంటీతోనే వెళ్లిపోయాడని ఫిర్యాదులో రాసిచ్చారు.. ఇప్పుడు ఈ బాలుడు-వివాహిత కోసం పోలీసులు - ఇరు కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. 
 

English Title
married woman run away with 16 years boy in ongole

MORE FROM AUTHOR

RELATED ARTICLES