టీఆర్ఎస్‌లో చేరేందుకు జగ్గారెడ్డికి అడ్డంకి అదేనా..?

టీఆర్ఎస్‌లో చేరేందుకు జగ్గారెడ్డికి అడ్డంకి అదేనా..?
x
Highlights

ఎక్కడైనా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్‌ల బాట పడుతుంటారు నేతలు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతుంటారు. కానీ తెలంగాణ...

ఎక్కడైనా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్‌ల బాట పడుతుంటారు నేతలు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భిన్నంగా ఉంది. విజేతగా గెలుపొందింది ఒక పార్టీ అయితే గెలిచిన తరువాత ఇంకోపార్టీ తీర్ధంపుచ్చకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వరుసపెట్టి గూలాబీ గూటికి చేరేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. తాజాగా మరో ముగ్గురు శాసన సభ్యుల నుంచి అధికార పార్టీకి సంకేతాలు అందాయి. భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు జగ్గారెడ్డి పార్టీలో చేరికపై భిన్నంగా స్పందించారు. అసలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తానేమీ ప్రయత్నించడం లేదన్నారు. తనపై వస్తున్నవార్తలను ఖండించినా ఉపయోగం లేకుండా పోతుందని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు. పార్టీలో ఉంటానా లే్క టీఆర్‌ఎఎస్‌లోకి వెళ్తానో కాలమే నిర్ణయిస్తుందన్నారు.

ఐతే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ప్రధాన అడ్డంకి ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఐతే గత 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి విజయకేతనం ఎగురవేశారు. కాగా కొద్దిరోజులకే గూలాబీ గూటీని వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చకున్నారు. అయితే సరిగ్గా అప్పుడే టీఆర్ఎస్ పార్టీని చీల్చడంలో జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక దాంతో అప్పడి నుండే జగ్గారెడ్డిపై గూలాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుర్రుగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కాగా టీఆర్ఎస్‌లో ఉన్న కీలక నేతలైన కేటీఆర్‌, హరీశ్ రావుపైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు జగ్గారెడ్డి. 2017లో మంజీర నీటిని మంత్రిగా ఉన్న హరీశ్ రావు అక్రమంగా తరలించారని, మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్ కోరికకు హరీశ్ రావు తూట్లు పొడిచారని ఇటివలే ఇలాంటి వ్యాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ హైకమాండ్ జగ్గారెడ్డిని పార్టీలోకి చేరాడాన్ని నిరారిస్తుందేమోనని జగ్గారెడ్డి ఊగిసలాడుతున్నట్లు సమాచారం. అయితే తనంతట తానుగా టీఆర్ఎస్‌ పెద్దలను సంప్రదించేందు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. అయితే ఏకంగా టీఆర్ఎస్ అధిష్ఠానం నుండే ఆహ్వానం వస్తే మాత్రం టక్కున చేరేందుకు జగ్గారెడ్డి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories