logo

నాగర్‌ కర్నూలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు...టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు ...

నాగర్‌ కర్నూలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మర్రి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు అప్పుడే బేరాలు మొదలుపెట్టారని ఆరోపించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తనకు ఫోన్ చేశారన్న మర్రి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారన్నారు. జానారెడ్డి ఇంట్లో మీటింగ్‌ పెట్టిన విశ్వేశ్వర్‌రెడ్డి తనను రమ్మని పిలిచారని మర్రి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నారన్న మర్రి జనార్దన్‌రెడ్డి ఓటుకు నోటు తరహాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు.

లైవ్ టీవి

Share it
Top