వివాహ వేడుకల్లో కాల్పులు...వధువు మృతి

Submitted by arun on Mon, 02/12/2018 - 10:53
Bride

పంజాబ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ ఘటన హోషియార్ పూర్‌లో గత శనివారం చోటుచేసుకుంది.హోషియార్ పూర్ పట్టణానికి చెందిన సాక్షి అరోరా జలంధర్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. సాక్షి అరోరా తండ్రి చరణ్ జిత్ అరోరా ఆమె పెళ్లి వైభవంగా చేసేందుకు డీజేతోపాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఉత్సవంలో భాగంగా డీజేపార్టీ సాగుతుండగా వధువు భవనం పైన నిలబడి వేడుకను తిలకిస్తోంది. అంతలో పెళ్లికి వచ్చిన అతిధులు వేడుకల్లో భాగంగా అత్యుత్సాహంతో అశోఖ్ సేథి, ఖోస్లాలు తాము తెచ్చిన డబుల్ బ్యారెల్ రైఫిల్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో బుల్లెట్ భవనం పైన నిలబడిన వధువు కణతకు తగిలి అక్కడికక్కడే మరణించింది. దీంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి సెక్షన్ 302, 34, ఆయుధాల వినియోగ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరైన ఖోస్లాను అరెస్టు చేశారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు.


 

English Title
marrage party Gun fire Bride dead

MORE FROM AUTHOR

RELATED ARTICLES