నాన్నా నీ మనసే వెన్న!

నాన్నా నీ మనసే వెన్న!
x
Highlights

నాన్న నడిపించే దైవం.. అమ్మ కనిపెంచుతుంది.. కానీ.. జీవితంలో ఎలా నడుచుకోవాలో నాన్నే నేర్పుతాడు. నాన్న మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో నేర్పే గురువు. ...

నాన్న నడిపించే దైవం.. అమ్మ కనిపెంచుతుంది.. కానీ.. జీవితంలో ఎలా నడుచుకోవాలో నాన్నే నేర్పుతాడు. నాన్న మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో నేర్పే గురువు. ఎదురు దెబ్బలను తట్టుకునేలా ఇచ్చే తర్ఫీదు నాన్న. చిటికెన వేలు పట్టుకుని వేయించిన తప్పటడుగులు జీవితంలో ఎప్పటికీ తప్పుటడుగులు కాకుండా చూసే బాధ్యత నాన్న! ఓటమిలో కన్నీళ్లను పన్నీరుగా ఎలా మార్చుకోవాలో చూపే దిక్సూచి నాన్న. జీవితపు వెలుగులో ఎదురయ్యే చీకటి కోణాలకు ఎలా స్పందించాలో చూపించే కొవ్వొత్తి నాన్న. అవును.. తాను కరిగిపోతాడు.. తనని తాను కోల్పోతాడు మైనంలా.. బిడ్డల ఎదుగుదలలోనే తన మలి జీవితపు సంతోషాన్ని వెతుక్కుంటాడు నాన్న. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్నంటే ప్రేమ పాలన. ఆ ప్రేమలో కోపం ఉంటుంది.. బాధ ఉంటుంది.. అన్నిటినీ మించి బిడ్డల ఎదుగుదల కోసం తన జీవితపు సరదాలను గాంభీర్యం మాటున దాచి పెట్టేసుకున్న త్యాగం ఉంటుంది.

నాన్నకూ ఓరోజును కేటాయించడమంటే నాన్న కోపానికి అర్థాన్ని వెతుక్కోవడం.. నాన్న బాధకు ఓదార్పిచ్చే ఔషధి కావడం.. నాన్న త్యాగాలకు ప్రేమపూర్వక కృతజ్ఞతను మనః పూర్వకంగా తెలియచెప్పటం.

ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే! ఈ సందర్భంగా ప్రపంచంలోని నాన్నలందరికీ శుభాకాంక్షల అక్షరాంజలి ఇది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories