పెట్రోల్ బంకులో ఎస్సై వీరంగం.. డీజిల్ పోయలేదని..

పెట్రోల్ బంకులో ఎస్సై వీరంగం.. డీజిల్ పోయలేదని..
x
Highlights

అధికార దర్పంతో ఓ ఎస్సై పెట్రోల్ బంక్ కార్మికుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన...

అధికార దర్పంతో ఓ ఎస్సై పెట్రోల్ బంక్ కార్మికుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఎస్సై రాంబాబు తన వాహనాన్ని డ్రైవరుకిచ్చి డీజిల్‌ పోయించుకురమ్మని స్థానిక ఓంనమశివాయ పెట్రోలు బంకుకు పంపారు. తన యజమాని చెబితేనే డీజిల్ పోస్తానని కార్మికుడు హుమాయున్ చెప్పాడు. డ్రైవర్ వెంటనే ఈ విషయాన్ని ఎస్సైకి ఫోన్ చేసి చెప్పాడు. ఆగ్రహించిన ఎస్సై వాహనాన్ని వెనక్కి పిలిపించి అదే వాహనంలో బంకుకు వచ్చి కార్మికుడిని కొట్టారు. అనంతరం స్టేషన్‌కి తీసుకెళ్లి కూడా కొట్టారని.. అదేమని అడిగితే అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనను నిరసిస్తూ ఎస్సైకు వ్యతిరేకంగా బంకు కార్మికులు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఈ ఘటనపై ఎస్సై రాంబాబు స్పందిస్తూ.. తాము నెలనెలా బిల్లు చెల్లిస్తామని, డీజిల్‌ కోసం వాహనం పంపితే కార్మికుడు డ్రైవరుతో దురుసుగా మాట్లాడాడని తెలిపారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories