అమిత్‌షాకి షాకిచ్చిన మంచు లక్ష్మీ

Submitted by arun on Tue, 12/19/2017 - 15:56
manchu lakshmi Amith Shah

హోరా హోరీగా సాగిన గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గుజ‌రాత్ అసెంబ్లీ సీట్లు భారీగా త‌గ్గిపోవ‌డంతో ప్ర‌ధాని మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు న‌రేంద్ర‌మోదీ కాస్త ఇబ్బంది ప‌డుతున్నారు. వ‌రుసగా ఆరోసారి గుజ‌రాత్‌లో విజ‌య‌ఢంకా మోగించిన‌ప్ప‌టికీ సీట్ల సంఖ్య త‌గ్గ‌డం వారికి మింగుడుప‌డ‌డం లేదు. గుజ‌రాత్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకున్న విష‌యం తెలిసిందే.
 
గుజరాత్‌ ఫలితాలపై అమిత్‌ షా ‘150 సీట్ల’ లెక్క తప్పిన వేళ.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఆయన కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ ఈ ఉదయం చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా ఉంది. 28 శాతం జీఎస్టీని ఉద్దేశిస్తూ ఆమె గుజరాత్‌ లో బీజేపీ గెలుచుకున్న సీట్ల సంఖ్యను అన్వయిస్తూ ఓ లెక్క చేసింది. మొత్తం 182 ను సీట్లను జీఎస్టీ శాతంతో లెక్కించి.. ఆ వచ్చిన సంఖ్యను 150(అమిత్‌ షా చెప్పిన ఫిగర్‌) నుంచి తీసేశారు. చివరగా 99 రాగా.. అది బీజేపీ గెల్చుకున్న ఫిగర్ అని తేలిపోయింది. జీఎస్టీ ప్ర‌కార‌మే గుజ‌రాత్ ప్ర‌జలు బీజేపీకి అసెంబ్లీ సీట్లు ఇచ్చార‌ని మంచు ల‌క్ష్మి చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

English Title
manchu lakshmi trolls Amith Shah on twitter

MORE FROM AUTHOR

RELATED ARTICLES