ఐఫోన్ ఆర్డర్‌ చేస్తే బట్టల సబ్బు డెలివరీ

Submitted by arun on Fri, 02/02/2018 - 10:31
 IPHONE

ముంబైలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. ఐ ఫోన్ కోసం ఆర్డర్ ఇచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఆన్‌లైన్‌లో ఐఫోన్‌ 8ని బుక్‌ చేశాడు. కొరియర్‌ రావడంతో ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఐఫోన్‌ను చూద్దామని ఆశతో బాక్స్‌ ఓపెన్‌ చేసి షాకయ్యాడు. అతనికి డెలివరీ అయ్యింది ఐఫోన్‌ 8 కాదు ఓ బట్టల సబ్బు. ముంబైకి చెందిన తబ్రేజ్‌‌ మెహబూబ్‌ ఫ్లిప్‌కార్టులో 55వేల రూపాయలు పెట్టి ఐఫోన్‌ 8ను బుక్‌చేశాడు. అయితే జనవరి 22న అతనికి ఐఫోన్‌ బదులు ఓ సబ్బు డెలివరీ అయింది. దాంతో బైకుల్లా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

English Title
MAN ORDERS IPHONE ONLINE, GETS BAR OF SOAP INSTEAD

MORE FROM AUTHOR

RELATED ARTICLES