ఎఫైర్: ఆ సంబంధం కోసం ఇంటికొస్తే... దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ

Submitted by arun on Fri, 08/17/2018 - 09:48
Rape Attempt

వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధించిన మాజీ ప్రియుడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన  కర్నూల్ జిల్లాలో జరిగింది. తాలూకా సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు.

ఆగష్టు 14 వ తేదీ రాత్రి విజయుడు  ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. కోపంతో  ఆ మహిళ రోకలిబండతో  విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు  కత్తితో పొడించింది. ఇంటికి తాళం వేసి పారిపోయింది.  ఆ తర్వాత బుధవారం సాయంత్రం ఆమె పోలీసులకు లొంగిపోయింది.నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు  సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.  మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
man-murdered-kurnool-while-rape-attempt

MORE FROM AUTHOR

RELATED ARTICLES