logo

బీజేపీ ఎమ్మెల్యేకు చెప్పుల దండతో స్వాగతం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. గ్రామస్థుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన బీజేపీ అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి అవమానపరిచాడు. దీంతో వెంటనే సదరు ఎమ్మెల్యేతోపాటు పక్కనే మరో కార్యకర్త కూడా ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నగాడాలో జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ షెకావత్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం ఆ పార్టీ నేతలను షాక్‌కు గురి చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి.

లైవ్ టీవి

Share it
Top