స్వీట్ పాన్‌లో డ్రగ్స్, టెక్కీపై అత్యాచారం

Submitted by arun on Fri, 06/08/2018 - 13:41

హైదరాబాద్‌ నగరంలో మరో కామాంధుడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రఖ్యాత మయూర్‌ పాన్‌ హౌస్‌ యజమాని ఉపేంద్ర వర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘‘ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలకు వలవేసి, పెళ్లిచేసుకుంటానని నమ్మించడం ఇతని నైజం. అలా దగ్గరైన అమ్మాయిలకు స్వీట్‌పాన్‌లో మత్తుమందు కలిపిచ్చి, అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి, వాటిని యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడంతోపాటు నానారకాలుగా వేధించేవాడు’’ అని పోలీసులు చెప్పారు.

 మహేంద్ర వర్మ నిజస్వరూపం తెలియని ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అతనికి దగ్గరయ్యారు. తీరా నమ్మకద్రోహానికి గురయ్యానని తెలుసుకున్న తర్వాత ధైర్యంగా బయటికొచ్చారు. వర్మపై కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు ఉపేంద్ర వర్మను అరెస్ట్‌చేసి విచారించగా.. ఊహించని విషయాలెన్నో బయటపడ్డాయి. పదుల సంఖ్యలో అమ్మాయిలతో వర్మ చనువుగా ఉన్న ఫొటోలు అతని వద్ద లభించాయి. నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అతనికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితుల కోసం గాలిస్తున్నారు. మయూర్‌ పాన్‌ హౌస్‌కు హిమాయత్‌ నగర్‌ సహా నగరంలో పలు చోట్ల శాఖలున్నాయి. 

English Title
Man Cheats Software women Employee at Hyderabad | accused Arrested

MORE FROM AUTHOR

RELATED ARTICLES