వివాహేతర సంబంధం...భార్య తల నరికిన భర్త

Submitted by arun on Tue, 09/11/2018 - 13:27
murder

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో ఓ భర్త ఆమె తల నరికి పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. అజ్జంపుర ప్రాంతంలో సతీశ్, రూప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ 9 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతంలో డ్రైవర్ గా పనిచేసిన సతీశ్ ఇటీవల అజ్జంపురలోని శివణిలో చికెన్ షాప్ తెరిచాడు. ఈ నేపథ్యంలో రూప(28) ఇదే ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు భర్త సతీశ్ హెచ్చరించినా రూప ప్రవర్తనలో మార్పు రాలేదు. కుటుంబ సభ్యులు, పెద్దలు రాజీ కుదర్చినా ప్రయోజనం లేకపోయింది.

ఈ నేపథ్యంలో సోమవారం పనిమీద షాపు నుంచి తొందరగా ఇంటికొచ్చిన సతీశ్.. భార్య రూప, సునీల్ సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. పక్కన ఉన్న కొడవలి తీసుకుని సునీల్ పై విసిరాడు. అతను దాని నుంచి తప్పించుకుని పారిపోవడంవతో సతీశ్ కోపం నషాళానికి అంటింది. దీంతో్ అదే కొడవలితో భార్య రూపపై విచక్షణారహితంగా దాడిచేశాడు. చివరికి ఆమె తలను మొండెం నుంచి వేరు చేశాడు. అనంతరం బైక్ పై 20 కి.మీ వెళ్లి అజ్జంపుర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు భార్యను ఎందుకు చంపావు అని ప్రశ్నించగా.. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే చంపేశానని సతీశ్ పోలీసులకు తెలిపాడు. 

English Title
Man beheads wife, walks into police station

MORE FROM AUTHOR

RELATED ARTICLES