రాహుల్‌ రాజీనామా.. కమిటీ తిరస్కరణ

రాహుల్‌ రాజీనామా.. కమిటీ తిరస్కరణ
x
Highlights

ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్విహంచారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని,...

ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్విహంచారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ కమిటీ తెలిపింది. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేస్తానన్నారు. పార్టీ కోసం పనిచేస్తానని, అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్‌ వెల్లడించినట్లు సమాచారం. అయితే రాహుల్‌ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. ఈ ఓటమి బాధ్యత అందరిది అని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు రాహుల్‌ను బుజ్జగించారు. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను రాహుల్‌కే అప్పగించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories