రంగస్వామి లీలలు గుట్టురట్టు..

Submitted by arun on Tue, 02/20/2018 - 17:26
Face Bookcheater

ఒంటరి మహిళలకు ఎర వేసి మోసం చేస్తున్న ఘరానా మోసగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒంటరిగా నివశిస్తున్న మహిళలను ఫేస్‌బుక్ ఛాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని మోసం చేస్తున్న రంగస్వామి రాచకొండ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి ఇప్పటి వరకు 10 మంది మహిళల్ని మోసం చేశాడు. ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగస్వామి లీలలు బయటపడ్డాయి. అయితే రంగస్వామిపై హైదరాబాద్‌లో ఇప్పటికే 10 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

English Title
man arrested cheating women facebook

MORE FROM AUTHOR

RELATED ARTICLES