logo

బీజేపీ వ్య‌తిరేక కూట‌మిపై మమతా క‌స‌ర‌త్తు

బీజేపీ వ్య‌తిరేక కూట‌మిపై మమతా క‌స‌ర‌త్తు

2019 ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఆమె ఢిల్లీలో పలువురు విపక్షనేతల్నీ, విపక్ష ఎంపీలతో వరుస చర్చలు జరుపుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోనూ, డీఎంకే ఎంపీ కనిమొళితోనూ మమతా బెనర్జీ విడివిడి సమావేశమయ్యారు. మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు గురించి వారితో మంతనాలు జరిపారు. అలాగే పలువురు విపక్ష ఎంపీలతోనూ మమత చర్చలు జరుపుతున్నారు.

ఇవాళ సాయంత్రం మమత సోనియా రాహుల్ తో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలాగే ఇతర విపక్ష పార్టీల నేతలతోనూ దీదీ సమావేశమై బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి చర్చిస్తారు. మోడీ వ్యతిరేక కూటమిలో శివసేన కూడా జతకలిసే అవకాశం కనిపిస్తోంది. శివసేన నేతలను కూడా మమతా బెనర్జీ చర్చలకు ఆహ్వానించారు. రేపు శివసేన ఎంపీలతో మమత భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

లైవ్ టీవి

Share it
Top