మ‌హేష్‌, రాజ‌మౌళి సినిమా ఎప్పుడంటే..

మ‌హేష్‌, రాజ‌మౌళి సినిమా ఎప్పుడంటే..
x
Highlights

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వినిపించాయి. 'బాహుబ‌లి2' త‌రువాత ఈ సినిమా...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వినిపించాయి. 'బాహుబ‌లి2' త‌రువాత ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్త నిజ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. 2018 చివ‌ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేసే చిత్రం ప్రారంభ‌మ‌వుతుంద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు మ‌హేష్‌.

మ‌హేష్‌ తాజా చిత్రం 'స్పైడ‌ర్' ఈ నెల 27న విడుద‌ల కానుండ‌గా.. కొర‌టాల శివ‌తో చేస్తున్న కొత్త చిత్రం 2018 వేస‌వికి విడుద‌ల కానుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న త‌న 25వ చిత్రం పూర్త‌య్యాకే రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో మ‌హేష్ సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రానున్న చిత్రం ఎలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories