‘అజ్ఞాతవాసి’ గురించి మహేశ్‌ కత్తి చెప్పిందే నిజమైందా?

Submitted by arun on Wed, 01/10/2018 - 13:11

‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి ఫిలిం క్రిటిక్‌ మహేశ్‌ కత్తి చెప్పింది చెప్పినట్లే జరిగిందా? ‘త్రివిక్రమ్‌ కాపీ దెబ్బకి ప్రొడక్షన్‌ హౌస్‌ బలైపోయింద’న్న కత్తి వ్యాఖ్యలు మరోసారి నిజమయ్యాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మూవీ కాపీ వివాదం మొదట్నుంచి వినిపిస్తోంది. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టారనే మాటే వినిపించింది ఐతే ఇప్పుడా విషయం నిజమని తేల్చేశాడు ఆమూవీ అసలు దర్శకుడు జెరోమ్ సల్లే తన మూవీ కాపీ కొట్టారనే వార్తల నేపధ్యంలో ఈ సినిమాని చూస్తానని మొన్నామధ్య ట్వీట్ పెట్టాడు ఇవ్వాల అజ్ఞాతవాసి మూవీని చూసి, అది తన మూవీ కి కాపీయేననని తేల్చేశాడు. అయితే ఆయా దేశాల కాపీరైట్‌ చట్టాలను అనుసరించి జెరోమ్‌.. ‘అజ్ఞాతవాసి’ దర్శకనిర్మాతలపై కేసు వేస్తారా, లేదా తెలియాల్సిఉంది.

కత్తి మహేష్ ఆరోపణలు నిజమయ్యాయి. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ తాజా సినిమా 'అజ్ఞాతవాసి' తన సినిమాకు కాపీయేనని ఫ్రెంచ్ చిత్రం 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సాలీ వ్యాఖ్యానించారు.  కాగా, ఈ చిత్రం 'లార్గో వించ్' చిత్రానికి కాపీ అని గతంలోనే కత్తి మహేష్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథపై తమకు స్పష్టత ఇవ్వాలని 'లార్గో వించ్' భారత హక్కులను సొంతం చేసుకున్న టీ-సిరీస్ నుంచి 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు నోటీసులు కూడా అందాయి. ఇక జెరోమ్ సాలీ ట్వీట్ ను చూసిన వారు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

English Title
mahesh kathi was right about pawan agnyaathavaasi

MORE FROM AUTHOR

RELATED ARTICLES