తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కత్తి మహేశ్ తీవ్ర విమర్శలు

Submitted by arun on Wed, 01/17/2018 - 16:03
Mahesh Kathi

సినీ విమర్శకుడు కత్తి మహేష్ బుధవారం చంచల్‌గూడ జైలులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని పేర్కొంటూ ఎమ్మార్పీఎస్‌కు తన మద్దతు ప్రకటించారు.

గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ బుధవారం చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నా అంతరాత్మ ప్రభోదానుసారం మందకృష్ణను కలిశా. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి. హక్కులకై పోరాడుతున్న మందకృష్ణను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దళితుల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళతాం. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం రావలి. ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా చేయాలి. తెలంగాణలో దళితులకు అయిదు ఎకరాల భూమి ఇవ్వాలి. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన తెలంగాణలో తీవ్రస్థాయికి చేరుకుంది. రోహిత్‌ వేముల బతికుంటే నాతో కలిసి వచ్చేవారు’ అని అన్నారు.

జిగ్నేష్ మేవానిని కూడా కత్తి మహేశ్ కలిశారు. జిగ్నేష్‌తో కలిసి నడుస్తూ తన మద్దతు ప్రకటించారు. జిగ్నేష్‌ను ఆదర్శంగా తీసుకుని దళిత సామాజిక వర్గానికి చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని గతంలో కూడా కత్తి మహేశ్ చెప్పారు. కత్తి మహేశ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... మొదటి నుంచి తాను దళితుడినని చెప్పుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గంలో తనపై ఓ సానుభూతి సంపాదించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English Title
Mahesh Kathi fire on cm kcr

MORE FROM AUTHOR

RELATED ARTICLES