హైకోర్టును ఆశ్రయించిన కత్తి మహేశ్‌

Submitted by arun on Wed, 07/25/2018 - 17:19
kathi

హైదరాబాద్ బహిష్కరణ అంశాన్ని సీని విశ్లేషకుడు కత్తి మహేష్ హైకోర్టులో సవాలు చేశారు. తనపై పోలీసులు జారీ చేసిన హైదరాబాద్ నగర బహిష్కరణ ఉత్తర్వులు రద్దు చేయలని పిటిషన్ దాఖలు చేశారు. కత్తి మహేష్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. అలాగే కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా హిందువులను కూడగట్టి హైదరాబాద్‌లో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానంద స్వామిని కూడా నగర పోలీసులు 6 నెలల పాటు బహిష్కరణ చేశారు. ఇద్దరూ వేర్వేరుగా తమపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.


 

 

English Title
Mahesh Kathi to challenge his externment order in High Court

MORE FROM AUTHOR

RELATED ARTICLES