భరత్ అనే నేను ఫస్ట్ డే కలెక్షన్స్

Submitted by arun on Sat, 04/21/2018 - 11:18
mahesh

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. భారీ ఓపెనింగ్స్ దక్కాయి. గురువారమే అమెరికాలో భారీగా ప్రీమియర్ షోలు వేశారు. ఇండియాలో విడుదలకు ముందు రోజే అక్కడ 2000 షోలు ప్రదర్శించారు. ఓవర్సీస్‌లో తొలి రోజే భరత్‌ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్టు సమాచారం. దీంతో బాహుబలి తర్వాత మహేశ్ మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు వచ్చినట్టు టాక్. కాగా మొదటి రోజున భరత్ అనే నేను 58 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది . మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి దాంతో భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి . మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 58 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసాడు మహేష్ బాబు .

మొదటి రోజునే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటుగా వసూళ్ల వర్షం కూడా కురుస్తుండటంతో నాన్ బాహుబలి చిత్రాల్లో భరత్ అనే నేను చిత్రం నెంబర్ వన్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మహేష్ ముఖ్యమంత్రి గా సరికొత్తగా కనిపించడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది.

English Title
mahesh babus bharat ane nenu first day box office collections

MORE FROM AUTHOR

RELATED ARTICLES