అమెరికాలో అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన ‘మహానటి’

Submitted by arun on Tue, 05/29/2018 - 16:22
Mahanati

అమెరికాలో ‘మహానటి’ వసూళ్ల హవా కొనసాగుతోంది. అలనాటి తార సావిత్రి జీవితం ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై మాహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మాహానటి’ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రిగా కీర్తి సురేష్ చూపిన అభినయానికి ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తాజాగా ‘మహానటి’ అమెరికా బాక్సాఫీసు వద్ద అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘సావిత్రమ్మ బాక్సాఫీసును ఇంకా ఏలుతున్నారు. 2.5 మిలియన్‌ డాలర్లకు (రూ.16.98 కోట్లు) ధన్యవాదాలు’ అని ట్వీట్‌లో పేర్కొంది. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు ‘మహానటి’ సినిమా తన ఖాతాలో మరో రికార్డు కూడా వేసుకుంది. విదేశాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాగా ఆరో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కూడా చిత్ర బృందం ఇటీవల తెలిపింది.
 

English Title
Mahanati America collections

MORE FROM AUTHOR

RELATED ARTICLES