కూటమి గుండెల్లో రెబెల్స్‌ మోత

కూటమి గుండెల్లో రెబెల్స్‌ మోత
x
Highlights

మహాకూటమి గుండెల్లో రెబెల్స్‌ మోత మోగిస్తున్నాయి. ఎన్నో ఎన్నో మలుపులు తిరుగుతూ సీట్లు ఖరారు అయిన కూటమిలో రెబెల్స్‌ బెడద కంటి మీద కునుకు లేకుండా...

మహాకూటమి గుండెల్లో రెబెల్స్‌ మోత మోగిస్తున్నాయి. ఎన్నో ఎన్నో మలుపులు తిరుగుతూ సీట్లు ఖరారు అయిన కూటమిలో రెబెల్స్‌ బెడద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూటమిగా కట్టిన పార్టీలతో పవర్‌ ఖాయమనుకున్న నాయకులు... తాజా ట్విస్టులు, సీటుపోట్లతో కిందా మీద పడుతున్నారు. మహాకూటమి పొత్తుతో అసమ్మతి సెగ రేగుతోంది. టికెట్ రాని వాళ్లు కచ్చితంగా పోటీచేస్తామంటూ అధిష్ఠానానికి సంకేతాలు పంపుతుండటంతో బరిలో నిలచే నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహాకూటమి పొత్తులతో అసంతృప్తిగా ఉన్న ఆశావహులు రెబెల్‌గా నిలిచేందుకే రెడీ అవుతున్నారు. మహాకూటమిగా తమకు ఇష్టం లేకపోయినా పొత్తులు పెట్టుకొని తమ రాజకీయ జీవితాలకు చెరమగీతం పాడతారా? అంటూ కాంగ్రెస్ ఆశావహులు అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించేందుకే సిద్దమవతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు నెలరోజుల నుం చే ప్రచారాలు షూరూ చేశారు. మొదటి నుంచి అధిష్ఠానం తమకే టికెట్ ఇస్తుందని ఆశించి నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కానీ తానోకటి తలిస్తే అధిష్ఠానం ఒకటి తలిచిందని తీవ్ర నిరాశలో ఉన్నారు కాంగ్రెస్ ఆశావహలు. ప్రజల వద్దే తేల్చుకుంటామని శపథం చేస్తున్నారు. తాము ఓడిపోయినా సరే తమను కాదని ఢిల్లీ నుంచి హైకమాండ్ పంపిన వారిని ఓడించి తీరుడే అంటూ ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలోనూ పొసగని పొత్తులతో ఆశావహులు ప్రజల మధ్యే తేల్చుకుంటామంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ ఇందిరకు కేటాయించడంతో దానిపై ఆశపెట్టుకున్న విజయరామారావు రెబెల్‌గా పోటీ చేస్తామంటున్నారు. వరంగల్‌ పశ్చిమపై ఆశతో అన్ని విధాల కాంగ్రెస్‌కు సహకరిస్తూ వస్తున్న డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కూడా రేవూరికి వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇక శేరిలింగంపల్లి నుంచి బిక్షపతి యాదవ్‌, దుబ్బాక నుంచి ముత్యం శ్రీనివాసరెడ్డి, కోదాడ నుంచి బొల్లా మల్లయ్యయాదవ్‌, జడ్చర్ల నుంచి అనిరుద్‌రెడ్డి, మంచిర్యాల నుంచి అరవింద్‌రెడ్డి, బాన్సువాడ నుంచి మల్యాద్రిరెడ్డి, ఆలేరు నుంచి రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్‌గా నిలబడుతామని ఇప్పటికే ప్రకటించేశారు. వీరంతా ఆయా స్థానాల్లో సీటు ఖరారైన అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

మొత్తానికి విచ్చుకుంటున్న పొత్తుల కత్తులు కూటమిలో కుంపట్లు రేపుతున్నాయి. రెండు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉన్నా కూడా స్పష్టత లేని పార్టీలో కొనసాగాలా.. లేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి తమ సత్తా ఏమిటో చాటాలా అన్న ఆగ్రహంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నాయకులు పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటమ్ జారీ చేస్తున్నారు. ఏమైనా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మహాకూటమి గుండెల్లో రెబెల్స్ మోగుతుండటం ఎన్నికల రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories