శ్రియ మరోసారి బాలయ్యబాబుతో..

శ్రియ మరోసారి బాలయ్యబాబుతో..
x
Highlights

బాలకృష్ణ-శ్రియ తెర మీద విజయవంతమైన జోడీల్లో ఒకటి. అప్పటి చెన్నకేశవరెడ్డి తో మొదలెట్టి.. విజఎంద్రవరం, గౌతమీపుత్ర శాతకర్ణి, మొన్నటి పైసా వసూల్ సినిమా...

బాలకృష్ణ-శ్రియ తెర మీద విజయవంతమైన జోడీల్లో ఒకటి. అప్పటి చెన్నకేశవరెడ్డి తో మొదలెట్టి.. విజఎంద్రవరం, గౌతమీపుత్ర శాతకర్ణి, మొన్నటి పైసా వసూల్ సినిమా వరకూ వీరి జోడీ ఆకట్టుకుంది. ఈ జంట మరో సినిమాలో జత కలవబోతోందని ఫిలిం నగర్ టాక్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రియాను తీసుకున్నట్టు సమాచారం. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలో శ్రియని నటింపచేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోందట. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు. ఒక పాత్ర కోసం శ్రియని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇద్దరు కతానయికల ఎంపిక పూర్తయితే సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories