డోర్ తీసేముందు జాగ్రత్త : అమెరికాలో కాలింగ్ బెల్ కొట్టిన మొసలి

డోర్ తీసేముందు జాగ్రత్త : అమెరికాలో కాలింగ్ బెల్ కొట్టిన మొసలి
x
Highlights

ఇంట్లో కాలింగ్‌ బెల్‌ మోగగానే హడావిడిగా వెళ్లి తలుపు తీయకండి ఎందుకంటారా ! ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం . దక్షిణ కరోలీనాలో ఆరున్నర...

ఇంట్లో కాలింగ్‌ బెల్‌ మోగగానే హడావిడిగా వెళ్లి తలుపు తీయకండి ఎందుకంటారా ! ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం . దక్షిణ కరోలీనాలో ఆరున్నర అడుగుల పొడవున్న మొసలి కాలింగ్‌ బెల్‌ కొట్టింది! చదువుతుంటే నమ్మశక్యంగా లేకపోయినా నిజంగానే జరిగింది . మిర్టిల్‌ బీచ్‌కు సమీపంలో కరెన్‌ ఆల్ఫానో అనే మహిళ ఇంటివద్ద ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆమె పొరుగింటి వాళ్లు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో న్యూస్ కాస్తా వైరల్‌గా మారింది. కాగా స్థానికులు జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారమివ్వడంతో. అధికారులు వెంటనే అలెర్ట్ అయి మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories