మహేష్ బాబుపై మాధవీలత హాట్ కామెంట్ !

Submitted by arun on Sat, 04/14/2018 - 12:27
madhavilatha mahesh babu

నటి శ్రీరెడ్డి వ్యవహారం తరువాత అనేకమంది హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకు జరుగుతున్న అన్యాయాలు గురించి అదేవిధంగా తాము ఎదుర్కుంటున్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి అనేక సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఈనేపధ్యంలో హీరోయిన్ మాధవీలత నిన్న ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొంటూ తమ పై జరుగుతున్న అన్యాయాలను టాప్ హీరోలు ఎందుకు పట్టించుకోలేదు అంటూ ప్రశ్నలు కురిపించింది. మన హీరోలు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించరో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని మాధవీలత వాపోయారు.  దాదాపు పదేళ్లక్రితం తనకు స్వయంగా జరిగిన ఒక తీవ్ర అవమానాన్ని ఏకరువుపెట్టారు. తెలుగు సినీరంగంలో మహిళా ఆర్టిస్టులకు జరుగుతోన్న అవమానాలకి ఆ విషయం ఒక పరాకాష్టగా చెప్పుకోవాలేమో.. విషయం ఏంటంటే.. ”తాను ‘అతిధి’ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నానని.. మేకప్ ఆలస్యం కావడంతో షూటింగ్ స్పాట్ కు కొంచెం ఆలస్యంగా వెళ్లానని.. అయితే, ఎందుకు లేట్ గా వచ్చావ్.. హీరోగారు నీకోసం వెయిట్ చేయాలా అని తీవ్ర స్వరంతో మాట్లాడారని, అయితే, తాను ఎందుకు ఆలస్యం అయిందో చెప్పే ప్రయత్నం చేశానని అదేమీ వినకుండా తనను బూతు మాటలతో తిట్టినప్పుడు హీరో మహేష్ అదే షూటింగ్ స్పాట్ లో ఉండి కూడ ఒక్క మాట తనకు సపోర్ట్ గా మాట్లాడలేదు అన్న విషయాన్ని బయటపెట్టింది. 

తనకు బూతులు మాట్లాడితే అస్సలు నచ్చదని, మంచిగా మాట్లాడితే తానూ మంచిగా మాట్లాడతానని, లేదంటే మాటకు మాట చెప్పే మనస్తత్వం తనదని చెప్పింది. అతను అంత బూతు మాట్లాడితే, అక్కడే ఉన్న హీరో మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని వాపోయింది. ఏంటామాట..? ఆడపిల్లని అలా అనొచ్చా..? ఎందుకలా అన్నారు? అని నోరెత్తొచ్చుగా అంటూ మాధవీలత.. మహేష్ బాబుని ప్రశ్నించారు. తన ఎదురుగానే ఇలాంటి ఘటనలు జరిగితే పట్టించుకోని మన హీరోలు ఎక్కడో జరిగిన దానికి ఏంమంటారని మాధవీలత సందేహం వ్యక్తం చేశారు. మహేష్‌బాబు హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ‘అతిథి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2007లో ఈ మూవీ రిలీజైంది.
 

English Title
madhavilatha hot comments on mahesh babu

MORE FROM AUTHOR

RELATED ARTICLES