ఏపీ విజేత జగన్... నా సర్వేలు తప్పు కాలేదంటున్న కేసీఆర్?

ఏపీ విజేత జగన్... నా సర్వేలు తప్పు కాలేదంటున్న కేసీఆర్?
x
Highlights

తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చూట్టే సుడిగుండంలా తిరుగుతున్నాయి....

తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చూట్టే సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఇటివల ఏపీలో ఎన్నికల సమరం ముగిసిన సంగతి తెలిసందే కాగా ఇక ఫలితాలపై ఎవరు లెక్కలు వారేసుకుంటున్నారు. కొందరేమో ఏపీలో తిరిగి పసుపు జెండా రేపరేపలాడుతుందని, మరికొందరు లేదు లేదు పసుపు జెండాను పని అయిపోయింది. ఇక ఏపీలో ఫ్యాన్ గాలి ప్రారభంజనం సృష్టస్తుందని అంటున్నారు. దీంతో ఏపీలో అధికారం పీఠం ఎవరిది అన్న విషయంలో ఎవరు విజేతగా నిలుస్తారన్నాది సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది.

మరోవైపు నారా చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వాలు గతంలో చక్కగా పనిచేశాయన్నవ్యాఖ్యలు కూడా ఇప్పడు రాజకీయంగా మరింత హీట్ పుట్టించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఏపీలో గెలిచేది జగనే అని చెబుతున్నట్లు సమాచారం. అయితే ఏపీలో ఎన్నికల ముగిసిన తరువాత ఎలాంటి వ్యాఖ్యలు చేయని కేసీఆర్ తాజాగా ఏపీ రాజకీయాలపై పార్టీ నాయకుల దగ్గర కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏపీలో నూటికి నూరు శాతం జగనే గెలుస్తాడని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తాను చేయించిన సర్వేలన్నీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలవడం ఖాయమని చెబుతున్నాయన్నారు. తన సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని కేసీఆర్ పార్టీ నాయకుల వద్ద అన్నట్లు సమాచారం. మొత్తానికి కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు ఫుల్ కుషిగా ఉన్నా ఇటు టీడీపీలో మాత్రం టెన్షన్ మొదలయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories