గుండు మ‌ర‌ణం..అస‌త్య‌ప్ర‌చారంపై స్పందించిన మా

గుండు మ‌ర‌ణం..అస‌త్య‌ప్ర‌చారంపై స్పందించిన మా
x
Highlights

గోరంతని కొండంతగా చేసి చూపించడంలో..సోషల్ మీడియా తర్వాతే ఎవరైనా. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ..అందరినీ గందరగోళంలో పడేస్తున్నాయి కొన్ని యూట్యూబ్...

గోరంతని కొండంతగా చేసి చూపించడంలో..సోషల్ మీడియా తర్వాతే ఎవరైనా. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ..అందరినీ గందరగోళంలో పడేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్. కమెడియన్ గుండుహనుమంతరావు మరణం తర్వాత..మా అసోసియేషన్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. అసలేంటా విషయం..? సోషల్ మీడియా పై మా అసోసియేషన్ ఎందుకు ఫైర్ అవుతుంది..? హ్యావే లుక్

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు..ఇటీవల గుండెపోటుతో మరణించారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు కన్నీటి నివాళులర్పించింది. ఓవైపు సినీ ఇండస్ట్రీ ఓ మంచి నటున్ని కోల్సోయిందని అందరూ బాధ పడుతుంటే..మరోవైపు కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ గుండు హనుమంతరావు విషయంలో అసత్య ప్రచారానికి తెరతీశాయి.

సినీ పరిశ్రమలో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సాయం చేసే ఉద్దేశంతో..మా అసోషియేషన్ ఆధ్వర్యంలో రెండు కోట్లతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని భావించినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నాయి. పైగా ఆ ట్రస్టుకు గుండు హనుమంతరావు ను చైర్మన్ గా చేయాలని..మెగాస్టార్ చిరంజీవే స్వయంగా నిర్ణయించినట్లు కూడా ప్రచారం చేశాయి.

అయితే ఈ రూమర్స్ పై HMTV మా అసోసియేషన్ ని సంప్రదిస్తే..అలాంటిదేం లేదని తేలిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని మా సభ్యులు తేల్చేశారు. ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నందుకు సదరు యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ పై చట్టరిత్యా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories