ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టాలనిపించింది

ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టాలనిపించింది
x
Highlights

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల గురించి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాము కూడా వేధింపులకు లోనయ్యామంటూ పలువురు హీరోయిన్లు కూడా ఆవేదన...

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల గురించి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాము కూడా వేధింపులకు లోనయ్యామంటూ పలువురు హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో 'అర్జున్ రెడ్డి', 'పెళ్లిచూపులు' సినిమాలకు పాటలు రాసి, పాప్యులర్ అయిన మహిళా గేయ రచయిత శ్రేష్ఠ కూడా చేరారు. తాను కూడా పరిశ్రమలో వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపారు.

గోవాలో జరిగిన ఓ పార్టీకి తాను రావాలంటూ ఓ దర్శకురాలు బలవంతం చేసిందనీ, ఓ వ్యక్తిని పరిచయం చేసి అతను నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిందన్నారు. కానీ అదే వ్యక్తి తనకు ఫోన్‌ చేసి..ఆ దర్శకురాలు నీ గురించి ఇంకోలా చెప్పిందని చీప్‌గా మాట్లాడటంతో షాక్‌ అయ్యానని వెల్లడించారు. ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలనిపించిందనీ..ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన అమ్మాయిలను వేధింపులకు గురిచేసేవారిలో మహిళలు కూడా ఉంటారన్న శ్రేష్ఠ మాటలు కలకలం రేపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories