ర‌జ‌నీకాంత్ పార్టీ లో చేరిన రాఘ‌వ‌ లారెన్స్

Submitted by arun on Fri, 01/05/2018 - 11:53
rajinis political revolution

త‌లైవా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై  బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌ద్ద‌తు ప‌లికారు. ర‌జ‌నీకి అంతా మంచే జ‌రుగుతుంద‌న్నారు. ఆయ‌న ఒక మంచి రాజ‌కీయ నేత అని అభివ‌ర్ణిస్తూ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ‌ల్లో బాగా రాణిస్తారనే నమ్మకముంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే ర‌జ‌నీ పార్టీ లో చేరిక‌లు షురూ అయ్యాయి. ర‌జ‌నీ పార్టీ పెట్టి ప‌ట్టుమ‌ని ప‌దిరోజుల‌కూడా కాకుండానే  బీజేపీ, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న పార్టీలో చేరేందుకు సిద్ధ‌మయ్యారు.  రజనీ ఏర్పాటు చేసే రాజకీయ పార్టీలో చేరుతున్నట్టు డైర‌క్ట‌ర్  రాఘవ లారెన్స్‌, 2.ఓ చిత్ర నిర్మాత రాజు మహాలింగం ప్రకటించారు. వీరిబాట‌లో మ‌రికొంత‌మంది సినీ పెద్ద‌లు రజ‌నీ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్న‌ట్లు స‌మాచారం. 

English Title
lycas raju mahalingam actor raghava lawrence join rajinis political revolution

MORE FROM AUTHOR

RELATED ARTICLES